Crime News: ఠాణా ఖాతా హ్యాక్.. ఫేస్‌బుక్‌లో అశ్లీల వీడియోలు
హ్యాకర్లు బరితెగించారు. గుర్తు తెలియని దుండగులు ఏకంగా పోలీస్‌స్టేషన్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ చేసి అశ్లీల వీడియోలు పోస్టు చేశారు.
హ్యాక్ అయిన ఠాణా ఫేస్‌బుక్ పేజీ
ఈనాడు, హైదరాబాద్: హ్యాకర్లు బరితెగించారు. గుర్తు తెలియని దుండగులు ఏకంగా పోలీస్‌స్టేషన్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ చేసి అశ్లీల వీడియోలు పోస్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆసిఫ్‌నగర్ ఠాణా అధికారులకు బుధవారం రాత్రి ఈ వింత పరిస్థితి ఎదురైంది. అప్రమత్తమైన పోలీసులు ఖాతాను వెంటనే స్తంభింపజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ ఎస్.నవీన్ వివరాల ప్రకారం..ఆసిఫ్‌నగర్ ఠాణా కానిస్టేబుల్ రవీందర్‌బాబు బుధవారం రాత్రి స్టేషన్ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కొన్ని నిమిషాల తర్వాత అదే పరిస్థితి ఉండడంతో తన ఫోన్‌లో ఖాతాను చూడగా.. ఐదు అశ్లీల వీడియోలు కనిపించాయి. వెంటనే ఉన్నతాధికారులకు విషయం తెలియజేయగా..పరిశీలించి ఖాతా హ్యాక్ గురైనట్లు గుర్తించారు. వీడియోలను తొలగించారు. దాదాపు 6 వేల మందికిపైగా అనుసరిస్తున్న ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అధికారుల్ని విస్మయానికి గురిచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్