తటాకాల అభివృద్ధికి విశేష కృషి: తలసాని
చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
లోటస్‌పాండ్ వద్ద ఘనంగా చెరువుల పండుగ
బుక్‌లెట్ ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌యాదవ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, చిత్రంలో కార్పొరేటర్ వెంకటేశ్, ఇరిగేషన్ సీఈ ధర్మ, లేక్స్ సీఈ సురేష్
ఫిలింనగర్, న్యూస్‌టుడే: చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘ఊరూరా చెరువుల పండుగ’ను బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్ చెరువు వద్ద గురువారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 185 చెరువుల పరిరక్షణకు అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అనంతరం చెరువుల పండుగ బుక్‌లెట్ ఆవిష్కరించారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సూచనలతో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నగరంలోని చెరువులను దత్తత ఇచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం బతుకమ్మ ఆడి గంగమ్మకు పూజలు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. చెరువుల పునరుద్ధరణతోభూగర్భజలాలు గణనీయంగా పెరిగాయన్నారు. జెడ్సీ రవికిరణ్, డీసీలు రజనీకాంత్, మోహన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ లేక్స్ సీఈ సురేష్, కార్పొరేటర్లు డేరంగుల వెంకటేష్, మన్నె కవితారెడ్డి, వనం సంగీతయాదవ్, ఆర్డీవో వసంతకుమారి, ఇరిగేషన్ సీఈ ధర్మ, ఎస్‌ఈ ఆనంద్, ఈఈ శంకర్‌రావు, డీఈఈ శశికళ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!