logo

మీనం.. అ‘ధర’హో!

మృగశిర కార్తె నేపథ్యంలో గురువారం చేపలకు డిమాండ్‌ పెరిగింది. కొనుగోళ్లకు వినియోగదారులు ఆసక్తి చూపడంతో వ్యాపారులు ధరను పెంచారు.

Published : 09 Jun 2023 02:10 IST

పరిగిలో కొనుగోళ్ల సందడి

న్యూస్‌టుడే, తాండూరు, తాండూరు గ్రామీణ: మృగశిర కార్తె నేపథ్యంలో గురువారం చేపలకు డిమాండ్‌ పెరిగింది. కొనుగోళ్లకు వినియోగదారులు ఆసక్తి చూపడంతో వ్యాపారులు ధరను పెంచారు. సాధారణ రోజుల్లో మృగశిర కార్తె రోజున చాలా మంది ఆరోగ్య రీత్యా చేపలను విధిగా తింటారు. ఆ మేరకు కొనుగోలుకు పోటీ పడ్డారు. తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ పట్టణాల్లో చేపల విక్రయాలు జోరుగా జరిగాయి. పట్టణాలకు పరిసరాల్లో ఉన్న గ్రామీణులు కూడా విక్రయ కేంద్రాలకు వచ్చి కొనుగోలు చేశారు. సాధారణ రోజుల్లో బొచ్చ, రవు, మార్పు వంటి తదితర రకాల చేపలను రూ.150 కే కిలో చొప్పున విక్రయించారు. మృగశిర కార్తె నాడు మాత్రం వీటి ధరను రూ.200 నుంచి రూ.250 వరకు పెంచారు. కిలో కొరమీను చేపలు రూ.400 నుంచి రూ.450 వరకు విక్రయించిన స్థానే  రూ.650 చొప్పున అమ్మారు. గడచిన వర్షాకాలంలో చెరువుల్లో పెంచిన చేపలను వ్యాపారులు ఒక రోజు ముందుగానే పట్టి నీటి టాం్యకుల్లో వేశారు. వీటినే మినీ వ్యాన్‌ల ద్వారా పట్టణాలకు తీసుకు వచ్చారు. డిమాండ్‌ ఉన్న రోజున మాత్రమే ధరలు పెంచి విక్రయించామని కొందరు వ్యాపారులు తెలిపారు.  
పరిగి: పరిగి పట్టణంలో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ఉదయం నుంచే మార్కెట్లో చేపల దుకాణాల ఏర్పాటుతో సందడి నెలకొంది. వివిధ రకాల చేపలను విక్రయించేందుకు వ్యాపారులు ఉత్సాహం చూపగా కొనుగోలుదారులు పెరిగిన ధరను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు