logo

గ్రూప్‌-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

ఈ నెల 11న ఉదయం 10:30 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగే గ్రూప్‌-1 పరీక్షను ఎలాంటి అవకతవకలు, పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు.

Published : 09 Jun 2023 02:10 IST

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ఈ నెల 11న ఉదయం 10:30 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగే గ్రూప్‌-1 పరీక్షను ఎలాంటి అవకతవకలు, పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 15 కేంద్రాల్లో 4,857 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 2 గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, తనిఖీ చేసి 10:15 గంటలకు హాల్‌లోకి పంపిస్తారని చెప్పారు. కేంద్రాల దగ్గర అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక వసతులు కల్పించాలని, పోలీసుల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర మెటల్‌ డిటెక్టర్‌, ఆరోగ్య శిబిరం అందుబాటులో ఉంచాలన్నారు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకు రావాలన్నారు. ప్రతి మండలం నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపాలని అధికారులను ఆదేశించారు.

22 కేంద్రాల్లో ఇంటర్‌ అడ్వాన్స్‌ పరీక్షలు

ఈ నెల 12 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు 22 కేంద్రాల్లో జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు కలిపి 7,797 మంది, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి 833 మంది హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని