logo

మీన ప్రసాదం.. జన ప్రవాహం

చేప ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

Published : 10 Jun 2023 01:42 IST

చేప ప్రసాదం కోసం వచ్చిన వారితో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం కిక్కిరిసింది. శుక్రవారం దేశ నలుమూలల నుంచి వచ్చిన ఉబ్బసం రోగులు క్యూలో గంటల తరబడి వేచి ఉండి చేప ప్రసాదం తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసింది.


చేప ప్రసాదం పంపిణీ విజయవంతం: తలసాని

అబిడ్స్‌: చేప ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఆస్తమా వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబ సభ్యులు తరలివచ్చారని, సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు 20 రోజుల ముందునుంచే ఏర్పాట్లను పర్యవేక్షించామని తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు సుమారు 80 వేల మందికి చేప ప్రసాదం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని