ఇక్కడ వంద శాతం ప్లేస్‌మెంట్స్!
‘‘సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం రావాలంటే ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో చదవాలి.. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపిక కావాలి.. అప్పుడే రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది’’.. కొన్నేళ్లుగా తల్లిదండ్రులు, విద్యార్థుల మనోగతమిది.
బహుళజాతి సంస్థల్లో రూ.10 లక్షలపైనే వార్షిక వేతనం
ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల అరుదైన ఘనత
ఈనాడు, హైదరాబాద్: ‘‘సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం రావాలంటే ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో చదవాలి.. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపిక కావాలి.. అప్పుడే రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది’’.. కొన్నేళ్లుగా తల్లిదండ్రులు, విద్యార్థుల మనోగతమిది. ఇందుకు భిన్నంగా ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు దీటుగా ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. కంప్యూటర్, ఐటీ కోర్సులు చదువుకుంటున్న విద్యార్థులంతా బహుళజాతి సంస్థల్లో ఏటా రూ.లక్షల వేతన ప్యాకేజీలు పొందుతున్నారు. ఒక విద్యార్థికి మాథ్ వర్క్ అనే బహుళజాతి సంస్థ గతేడాది రూ.24 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. 66 మందికి రూ.పది లక్షలు, ఆపై వేతన ప్యాకేజీలు లభించాయి. వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కళాశాలగా ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించింది. కంప్యూటర్, ఐటీ కోర్సులే కాకుండా ఇతర కోర్సుల్లో 80 శాతం మందికి ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయి.
వినూత్న మార్పులు..
వందేళ్లలో లక్షల మంది ఇంజినీర్లను తీర్చిదిద్దిన ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తోంది. మారుతున్న పరిస్థితులు.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ.. మూల్యాంకనంలో మార్పులు చేస్తుంది. త్రీడీ ప్రింటింగ్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ చట్టాలు, కృత్రిమ మేధకు సంబంధించిన ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా ఇరవైకి పైగా బహుళజాతి సంస్థలు ప్రాంగణ నియామకాలు నిర్వహించాయి. రూ.8 లక్షల నుంచి రూ.24 లక్షల వార్షిక వేతనంతో 240 మందికి ఉద్యోగాలు వచ్చాయి. నలుగురు విద్యార్థులకు రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వార్షిక వేతనం లభించింది. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వార్షిక వేతనాన్ని 57 మంది పొందారు. డీ షా, ఒరాకిల్, జీఈ డిజిటల్, ఎన్‌సీఆర్, ఏడీపీ, ఫ్యాక్ట్‌సెట్, ఫనాటిక్స్, మారుతి సుజికీ కంపెనీల ప్రతినిధులు ప్రాంగణ నియామకాలకు హాజరై.. విద్యార్థుల ప్రతిభను పరీక్షించి నియామకపు పత్రాలు ఇచ్చారు.
వంద లోపు ర్యాంకు సాధించాలని...
ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ప్రిన్సిపల్
ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలను జాతీయ స్థాయి ర్యాంకింగ్‌లో వంద లోపు నిలపాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు సమకూర్చుకుంటున్నాం. ప్రైవేటు కళాశాలల్లో చదివితేనే క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు వస్తాయన్న భావన సరి కాదు. ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్స్, ఐటీ కోర్సులు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికీ ఉద్యోగం లభిస్తుందని వరుసగా రెండేళ్లు నిరూపించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
చంద్రునిపై ల్యాండర్, రోవర్ నుంచి అందని సంకేతాలు
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?