logo

నిర్మాత ‘బెల్లంకొండ’ కారులో చోరీ

సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కారులో చోరీ జరిగింది. ఆగంతకుడు కారు అద్దం పగులగొట్టి కొంత నగదు, ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లాడు.

Published : 10 Jun 2023 01:42 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కారులో చోరీ జరిగింది. ఆగంతకుడు కారు అద్దం పగులగొట్టి కొంత నగదు, ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లాడు.. జూబ్లీహిల్స్‌ పోలీసుల  వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని బెల్లంకొండ సురేష్‌ అలియాస్‌ సురేంద్ర చౌదరికి సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో కార్యాలయం ఉంది. గురువారం మధ్యాహ్నం సురేష్‌కు చెందిన బెంజి కారును కార్యాలయం ముందు నిలిపారు. శుక్రవారం ఉదయం చూడగా కారు ఎడమవైపు వెనుక సీటువద్ద అద్దం పగిలి ఉంది. లోపల ఉంచిన రూ.50వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు కనిపించలేదు. ఒక్కో మద్యం సీసా ఖరీదు దాదాపు రూ.28వేలు. ఈ మేరకు కార్యాలయ సిబ్బంది జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్సై రాజశేఖర్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘటనపై సురేష్‌ సతీమణి పద్మావతి ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని