logo

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యువతి ఆత్యహత్యాయత్నం

బెంగళూరుకు చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం చోటు చేసుకుంది.

Published : 10 Jun 2023 15:19 IST

హైదరాబాద్‌: బెంగళూరుకు చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం చోటు చేసుకుంది. ప్యాసెంజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ (PTB-Passenger Terminal Buildings) నుంచి యువతి దూకడానికి యత్నిస్తుండగా అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఎం.శ్వేత (22), కర్నూల్‌కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి వీరిద్దరు శనివారం వచ్చారు. బెంగళూరుకు వెళ్లడానికి విష్ణు నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన శ్వేత ఆత్మహత్యకు యత్నించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు