logo

కాంగ్రెస్‌ నేతలతో జూపల్లి కృష్ణారావు వేర్వేరు భేటీలు

మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, కొల్లాపూర్ నియోజక వర్గ నాయకులు జగదీశ్వర్ రావులతో భారాస బహిష్కృత నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వేర్వేరుగా భేటీ అయ్యారు.

Published : 10 Jun 2023 15:38 IST

హైదరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, కొల్లాపూర్ నియోజక వర్గ నాయకులు జగదీశ్వర్ రావులతో భారాస బహిష్కృత నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వేర్వేరుగా భేటీ అయ్యారు. మల్లు రవి, జగదీశ్వర్ రావు ఇళ్లకు వెళ్లి జూపల్లి చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటలకు పైగా వారితో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని