Harishrao: ఏపీ నేతలకు మాటలెక్కువ.. చేతలు తక్కువ: హరీశ్‌రావు

ఏపీ పాలకులపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మరోసారి విమర్శలు గుప్పించారు.  అక్కడి నాయకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ ఎద్దేవా చేశారు.

Updated : 10 Jun 2023 19:39 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పాలకుల తీరుపై మంత్రి హరీశ్‌రావు మరోసారి విమర్శలు గుప్పించారు. పాలకుల తీరు వల్లే ఏపీ రాష్ట్రం వెల్లకిలా పడిందన్నారు. అక్కడి నాయకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారు. హైదరాబాద్‌లో రోజూ కర్ఫ్యూ ఉంటుందన్నారు. పరిపాలన చేత కాదు.. విద్యుత్‌ ఉండదన్నారు. వాటన్నింటినీ పక్కకు నెట్టి తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. తెలంగాణ అభివృద్ధి తెలియాలంటే పక్క రాష్ట్రం వెళ్లి చూడాలి’’ అని హరీశ్‌రావు అన్నారు.

అనంతరం హైదరాబాద్‌ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో 20 ఏళ్లకు ఒక్క మెడికల్‌ కాలేజీ పెట్టారని గుర్తు చేసిన హరీశ్‌రావు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లలో 21 మెడికల్‌ కళాశాలలు ప్రారంభించామని తెలిపారు.తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30శాతం ఉంటే.. మే నెలలో అవి 70శాతానికి చేరాయన్నారు. జూన్‌ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని