logo

కారణజన్ముడు అక్కినేని నాగేశ్వరరావు

అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ములని వక్తలు కొనియాడారు. అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా(ఏఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రవీంద్రభారతిలో..

Updated : 18 Sep 2023 06:12 IST

రవీంద్రభారతి: అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ములని వక్తలు కొనియాడారు. అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా(ఏఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రవీంద్రభారతిలో.. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నటుడు, నిర్మాత మురళీమోహన్‌ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో అక్కినేని సాధించినన్ని పురస్కారాలు మరెవరూ సాధించలేదన్నారు. ఏఎఫ్‌ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ప్రసాద్‌ తోటకూర అధ్యక్షోపన్యాసం చేశారు. తమిళనాడు పూర్వ గవర్నర్‌ పి.ఎస్‌.రామ్మోహనరావుకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. డా.ఎ.వి.గురువారెడ్డి, డా. ఏఎస్‌ నారాయణలకు వైద్యరత్న, సినీ గేయ రచయిత డి.రామజోగయ్యశాస్త్రి, డా.వడ్డేపల్లి కృష్ణలకు సినీరత్న అవార్డులు అందజేశారు. సంగీత ఆచార్యులు, గాయకులు కొమండూరి రామాచారికి రంగస్థల పురస్కారాన్ని ప్రదానం చేశారు. అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను డా.వంశీ రామరాజు, మద్దాళి రఘురామ్‌, ఇ.భవాని తదితరులకు అందజేశారు. అక్కినేని కుటుంబ సభ్యులు నాగసుశీల, సుమంత్‌, సుశాంత్‌, ఏఎఫ్‌ఏ అధ్యక్షుడు మురళీ వెన్నం, కార్యదర్శి రవి కొండబోలు, కమిటీ సభ్యురాలు, గాయని శారద ఆకునూరి పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని