logo

సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు: గవర్నర్‌

తెలంగాణ విమోచనం సువర్ణాక్షరాలతో లిఖించతగిన రోజు అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

Updated : 18 Sep 2023 05:30 IST

పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న గవర్నర్‌ తమిళిసై, చిత్రంలో కిషన్‌రెడ్డి

అల్వాల్‌, న్యూస్‌టుడే: తెలంగాణ విమోచనం సువర్ణాక్షరాలతో లిఖించతగిన రోజు అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విమోచన దినోత్సవ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిజాం కాలంలో నగరం సమీపంలోని బయనపల్లి గ్రామ మహిళలు, పురుషులు చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలయంలో వేడుకలు నిర్వహించాలని ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విమోచన దినోత్సవం ప్రత్యేకతను వివరించారు. అంతకుముందు మూడ్రోజులుగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్రపతి అదనపు కార్యదర్శి డాక్టర్‌ రాకేశ్‌ గుప్తా, ఉప కార్యదర్శి స్వాతి సాహి, నిలయం అధికారి రజనీ ప్రియ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు