వీధివీధినా వెలసి.. మదిమదినా కొలిచి
కరిముఖుడు విభిన్న రూపాల్లో వాడవాడలా కొలువుదీరాడు. నగరంలో సోమవారం గణేశ్ నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి.
కరిముఖుడు విభిన్న రూపాల్లో వాడవాడలా కొలువుదీరాడు. నగరంలో సోమవారం గణేశ్ నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. వీధులు, విద్యాలయాలు,కార్యాలయాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో గణపతి పూజలతో నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. 63 అడుగుల బడా లంబోదరుడికి భక్తుడు శివన్న ఆధ్వర్యంలో 63 కిలోల సేంద్రియ లడ్డూ సమర్పించారు. పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేయించిన 75 అడుగుల చేనేత నూలు కండువా, జంధ్యం సమర్పించారు.
గణనాథుని ఘన రూపాలు
మొత్తం 90 వేల విగ్రహాలు
నారాయణగూడ: ఈ ఏడాది మొత్తం 90 వేల విగ్రహాలు ప్రతిష్ఠించారని, గతేడాదికంటే ఈసారి 25 శాతం పెరిగాయని మంత్రి తలసాని అన్నారు. నిమజ్జనోత్సవం ఏర్పాట్లపై మంగళవారం పీపుల్స్ ప్లాజాలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్, సీపీ సీవీ ఆనంద్, అదనపు కమిషనర్ విక్రమ్‌సింగ్‌మాన్, మధ్య మండలం డీసీపీ వెంకటేశ్వర్లు, చంద్రకాంత్‌రెడ్డితో సమావేశమై సూచనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Papam Pasivadu Review: రివ్యూ: పాపం పసివాడు.. సింగర్ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ
-
TCS: భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్ టీసీఎస్
-
ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ
-
పైకి లేచిన బ్రిడ్జ్.. కిందికి దిగలేదు: లండన్ ఐకానిక్ వంతెన వద్ద ట్రాఫిక్ జామ్
-
USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్ ఊసెత్తని అమెరికా..!