Hyd News: హైదరాబాద్‌లో నేటి నుంచి గ్రీన్ మెట్రో బస్సులు రయ్ రయ్
నగరంలో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. బుధవారం వీటిని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గచ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రారంభించనున్నారు.
నేడు మంత్రి పువ్వాడ చేతుల మీదుగా ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: నగరంలో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. బుధవారం వీటిని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గచ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రారంభించనున్నారు. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతగా 25 బస్సులు వస్తున్నాయి. నవంబరులో మరో 25 అందుబాటులోకి రానున్నాయి.
అత్యాధునిక సౌకర్యాలతో..
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 3 గంటల నుంచి 4 గంటలలోపు వంద శాతం పూర్తి ఛార్జింగ్ అవుతుంది. 12 మీటర్ల పొడవు, 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతోపాటు రీడింగ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం ఉంది. 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
కొత్త బస్సులు తిరగనున్న మార్గాలివి.
మియాపూర్-విమానాశ్రయం: 5, జేబీఎస్-విమానాశ్రయం: 3(ఎల్బీనగర్ మీదుగా), జేబీఎస్-విమానాశ్రయం:2(మెహిదీపట్నం మీదుగా) బాచుపల్లి-వేవ్‌రాక్: 5, సికింద్రాబాద్- వేవ్‌రాక్: 10
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
JioFiber: జియో ఫైబర్ ఆఫర్.. 30 రోజులు ఉచిత సర్వీస్
-
Girlfriend effect: కొత్త ట్రెండ్.. #గర్ల్‌ఫ్రెండ్ ఎఫెక్ట్.. ఇంతకీ ఏమిటిది?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే
-
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
-
Janhvi Kapoor: అశ్లీల వెబ్‌సైట్స్‌లో నా ఫొటోలు చూసి షాకయ్యా: జాన్వీకపూర్
-
POCSO Act: లైంగిక కార్యకలాపాలకు ‘సమ్మతి’ వయసు 18 ఏళ్లే.. దాన్ని తగ్గించొద్దు: లా కమిషన్