రిజర్వు ఎస్సైనంటూ బుకాయించాడు.. అడ్డంగా బుక్కయ్యాడు
నకిలీ పోలీసు వేషం కట్టి.. అమాయక ప్రజలను మోసగిస్తున్న ఓ యువకుడిని ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఘట్‌కేసర్, న్యూస్‌టుడే: నకిలీ పోలీసు వేషం కట్టి.. అమాయక ప్రజలను మోసగిస్తున్న ఓ యువకుడిని ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఎం.మహేందరెడ్డి, ఎస్సై డి.అశోక్‌తేజ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ మండలం చౌదరిగూడ వెంకటసాయినగర్ ఫేజ్-2లో నివాసం ఉంటున్న కుసుమ ప్రశాంత్(26)కు చిన్నాటి నుంచి పోలీసు కావాలని కోరిక ఉంది. ప్రయత్నించినా పోలీసు ఉద్యోగం సాధించలేకపోయాడు. దాంతో నకిలీ పోలీసుగా తయారయ్యాడు. రిజర్వు ఎస్సై ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను, స్నేహితులను నమ్మించాడు. శిక్షణకు వెళ్తున్నట్లు చెప్పి వారికి కొన్ని రోజులు దూరంగా ఉన్నాడు. ఆ తరువాత పోలీసు యూనిఫారంలో దర్శనమిచ్చాడు. పోలీసుల ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయని, ఏదైనా కేసు ఉంటే తనకు చెప్పాలని కలకుంట్ల ప్రసాద్ అనే వ్యక్తికి చెప్పాడు. అతను ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్‌లో ఓ కేసు ఉందని పరిష్కరించాలని కోరాడు.
ఇలా దొరికిపోయాడు.. ప్రసాద్ కోరిక మేరకు ప్రశాంత్ ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి.. తాను రిజర్వు సబ్‌ఇన్‌స్పెక్టర్ అంటూ పరిచయం చేసుకున్నాడు. అందరికీ నమ్మకం కలిగించేలా చేశాడు. ఎస్సై డి.అశోక్‌తేజను పరిచయం చేసుకున్నాడు. వచ్చిన పని ఏమిటని అడిగాడు ఎస్సై.. తనకు తెలిసిన వారిని కొందరిని ఓ కేసులో పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారని, ఎలాంటి కేసు లేకుండా చూడండి అంటూ వేడుకున్నాడు. తమ శాఖకు చెందిన వ్యక్తి కావడంతో చూద్దామని పంపించాడు. విచారణలో ఎస్సై అంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి నకిలీ పోలీసని, విద్యార్థి అని గుర్తించారు. అతని చరవాణి తనిఖీ చేశారు. అందులో పోలీసు వేషంలో ఉన్న పలు ఫొటోలను గుర్తించారు. నిందితుడి నుంచి పోలీసు యూనిఫారం, రెండు చరవాణిలు, రూ.21,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddharth: కన్నడ ప్రజల తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు: ప్రకాశ్ రాజ్
-
Canada: హంతకులకు ఆశ్రయం ఇస్తున్నారు.. కెనడాపై బంగ్లాదేశ్ మంత్రి తీవ్ర ఆరోపణలు
-
Imran Tahir: 44 ఏళ్ల వయసులోనూ తాహిర్ జోరు.. ధోని రికార్డు బద్దలు కొట్టి..
-
Trump: అమెరికాలో ఏదో జరగబోతోంది.. : జోబైడెన్ ఆందోళన
-
Papam Pasivadu Review: రివ్యూ: పాపం పసివాడు.. సింగర్ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ