క్యాన్సర్‌పై లోతైన పరిశోధనలు చేపట్టాలి
ప్రమాదకరంగా తయారైన క్యాన్సర్‌పై లోతైన పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.
గచ్చిబౌలి, న్యూస్‌టుడే: ప్రమాదకరంగా తయారైన క్యాన్సర్‌పై లోతైన పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని ఏపీ హౌజింగ్ బోర్డు కాలనీలో కొత్తగా ఏర్పాటుచేసిన పై హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్‌ను మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా రకాల క్యాన్సర్లకు ఉత్తమ చికిత్స అందుతుందన్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పై క్యాన్సర్ ఆసుపత్రి హైదరాబాద్‌లో తమ శాఖను ప్రారంభించడం అభినందనీయమన్నారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా క్యాన్సర్ చికిత్సను అందించాలని సూచించారు. క్యాన్సర్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వ్యాధి నివారణకున్న మార్గాలపై అవగాహన పెంపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో పై హెల్త్ సీఓఓ డా.బాబీరెడ్డి, సీఈఓ డా.జాఫ్ కిమ్, మేనేజింగ్ డైరెక్టర్ వినాయక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Airtel: ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ రూ.2.81 కోట్ల జరిమానా
-
Gold Robbery: రూ.25 కోట్ల నగల చోరీ కేసులో కీలక పురోగతి
-
IPO: ఐపీఓకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దరఖాస్తు
-
Crime: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని.. నిప్పంటించిన తల్లి, సోదరుడు
-
ICC World Cup: వరల్డ్ కప్ లక్ష్యంగా.. ‘ఖలిస్థానీ ఉగ్రవాది’ పన్నూ బెదిరింపులు..!
-
Nara Lokesh: అప్పటి వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు ఆదేశం