logo

కేసీఆర్‌ మాటలు నమ్మొద్దు: ఈటల

దేశంలోని మూడున్నర కోట్ల మందికి ఇళ్లు కట్టించిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని భాజపా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు.

Published : 20 Sep 2023 02:17 IST

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: దేశంలోని మూడున్నర కోట్ల మందికి ఇళ్లు కట్టించిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని భాజపా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌ మాత్రం సనత్‌నగర్‌ నియోజకవర్గంలో వందమందికి ఇళ్లను నిర్మించి అందరికీ ఇలాంటి ఇళ్లనే నిర్మించి ఇస్తామని చెబితే జనాలు నమ్మి ఓట్లు వేశారన్నారు. ఒక్క ఇల్లు కట్టడానికి పదేళ్లు పడుతుందా అని ప్రశ్నించారు. మరోసారి మాయమాటలతో వస్తున్న కేసీఆర్‌ మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మొయినాబాద్‌ మండలం సురంగల్‌లో పార్టీ నేత గుమ్మళ్ల సీతారాంరెడ్డి సొంత ఖర్చుతో 250 మంది రైతులకు మందు పిచికారీ పంపులు, వృద్ధులు, వికలాంగులకు మూడుచక్రాల సైకిళ్లు, వాకింగ్‌ స్టిక్స్‌, బెల్టులు ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని