logo

సినీ కార్మికులకు అండగా ప్రభుత్వం: తలసాని

రాష్ట్ర ప్రభుత్వం సినీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

Published : 20 Sep 2023 02:17 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం సినీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. తెలంగాణ ఫిలిం ఫెడరేషన్‌ అధ్యక్షుడు వడ్డె కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి తెలుగు సినీ పరిశ్రమ కార్మిక సంఘం పదో వార్షికోత్సవాన్ని అమీర్‌పేటలోని సారధి స్టూడియోస్‌లోని ప్రివ్యూ థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు. పేదల కోసం అమలు చేస్తున్న అన్ని పథకాలు సినీ కార్మికులకూ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఫిలిం ఫెడరేషన్‌ ఛైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శులు దామోదర ప్రసాద్‌, అనుపమ్‌రెడ్డి, నవీన్‌యాదవ్‌, మా అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మాదాల రవి, కోశాధికారి శివబాలాజీ, నటులు సుమన్‌, మూర్తి, ఠాగూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు