logo

కోతుల భయంతో మేడపై నుంచి దూకిన బాలుడికి గాయాలు

కోతులు వెంబడించడంతో ఓ బాలుడు భయంతో మేడపై నుంచి కిందకు దూకి గాయాలపాలైన ఘటన ఆమనగల్లులోని శ్రీవెంకటేశ్వర కాలనీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Published : 20 Sep 2023 02:17 IST

ఆమనగల్లు, న్యూస్‌టుడే: కోతులు వెంబడించడంతో ఓ బాలుడు భయంతో మేడపై నుంచి కిందకు దూకి గాయాలపాలైన ఘటన ఆమనగల్లులోని శ్రీవెంకటేశ్వర కాలనీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాలుడు తండ్రి రవి, కాలనీవాసుల వివరాల ప్రకారం.. ఆమనగల్లు వెంకటేశ్వర కాలనీలోని ఓ ఇంట్లో మొదటిఅంతస్తులో కేతావత్‌ రవి- దేవీబాయి నివాసముంటున్నారు. వీరి పెద్ద కుమారుడు 6వ తరగతి, చిన్న కుమారుడు వినోద్‌ 4వతరగతి చదువుతున్నారు. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. కోతులు రావడంతో వినోద్‌ భయంతో మేడపై నుంచి దూకడంతో గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని