logo

భూ వివాదంలో అక్కినేని నాగ సుశీల, మరో మహిళపై కేసు

ఓ భూ వ్యవహారంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ అక్కినేని నాగసుశీల, మరో మహిళపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఏవీ రంగా తెలిపిన వివరాల ప్రకారం..

Published : 20 Sep 2023 02:17 IST

మెయినాబాద్‌, న్యూస్‌టుడే: ఓ భూ వ్యవహారంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ అక్కినేని నాగసుశీల, మరో మహిళపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఏవీ రంగా తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ మండలం చిన్నమంగళారంలోని ‘శ్రీజ ప్రకృతి దర్శపీఠం’ ఆశ్రమ స్థలంపై వివాదం నడుస్తోంది. ఇందులోని అర ఎకరా స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలు కొనసాగుతుండగానే ఈనెల 12వ తేదీన సినీ నటుడు అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల ఆ స్థలంలో కొలత(సర్వే)లు తీయించేందుకు ప్రయత్నించారు. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ట్రెజరర్‌గా వ్యవహరిస్తున్న మంజుల ఆ పనులను ఆపేశారు. ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో నాగ సుశీల, మంజుల ఒకరిపై ఒకరు మెయినాబాద్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 16వ తేదీన ఇరువురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని