logo

Hyd News: ఆస్పత్రిలో బిల్లు కట్టలేక.. శిశువును వదిలేసిన తల్లిదండ్రులు

నవజాత శిశువును చికిత్స కోసం తల్లిదండ్రులు కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. బిల్లు తడిసి మోపెడయ్యింది. బిల్లు చెల్లించలేక 13 రోజుల శిశువును దవాఖానాలో వదిలేశారు.

Updated : 20 Sep 2023 09:24 IST

ఐఎస్‌ సదన్‌, న్యూస్‌టుడే: నవజాత శిశువును చికిత్స కోసం తల్లిదండ్రులు కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. బిల్లు తడిసి మోపెడయ్యింది. బిల్లు చెల్లించలేక 13 రోజుల శిశువును దవాఖానాలో వదిలేశారు. ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ సింగరేణి కాలనీలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీ రోడ్డు నం.14 ప్రాంతానికి చెందిన నితిన్‌(23), రవళిక(20) ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు దినసరి కూలీలు. వారికి ఈ నెల 7న పాప జన్మించింది. ఆరోగ్యం బాగా లేకపోవడంతో అదే రోజు నిలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్‌ ద్వారా వైద్యం అందించి ఆరోగ్యం కుదుటపడడంతో ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత పాప శరీరంలో మార్పు రావడంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యుడిని సంప్రదించారు. వైద్యుడు పరిశీలించి చిన్నారికి మెరుగైన చికిత్స అవసరమని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దాంతో పిసల్‌బండలోని ఓ దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వైద్యం అందించారు. ఆరోగ్యం కుదుట పడటంతో ఐదు రోజుల క్రితం డిశ్చార్జి చేశారు. చికిత్సకు రూ.1.16లక్షలు బిల్లు వేశారు. తమ వద్ద ఉన్న రూ.35వేలు చెల్లించారు. మిగతా డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో చిన్నారిని ఆసుపత్రిలోనే వదిలేసి వచ్చారు. మంగళవారం విలేకరుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని