రక్తహీనత.. మేల్కొంటేనే భవిత
ఈ ఏడాది ఇప్పటి వరకు రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో 13 మంది బాలింతలు మృతి చెందారు. వీరిలో 8 మంది ప్రైవేటు, ఐదుగురు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నారు.
గర్భిణులు, పుట్టే బిడ్డలపై తీవ్ర ప్రభావం
పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం
న్యూస్‌టుడే, వికారాబాద్
ఈ ఏడాది ఇప్పటి వరకు రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో 13 మంది బాలింతలు మృతి చెందారు. వీరిలో 8 మంది ప్రైవేటు, ఐదుగురు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నారు. మనిషి ఆరోగ్యానికి రక్తం కీలకమని ఈ ఉదాహరణ మరోసారి స్పష్టం చేస్తోంది. ఐరన్ లోపంతో తలెత్తే రక్తహీనత సమస్యను చాలా మంది గర్భిణులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పౌష్టికాహార లోపమే ఇందుకు కారణంగా వైద్యులు చెబుతున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం నిర్వహించే అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, పిల్లలు, ఆరోగ్య కేంద్రాల్లో హెచ్‌బీ పరీక్ష చేసుకున్న గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’ కథనం.
ఆరోగ్య లక్ష్మి అమలులో ఉన్నా..
గర్భిణులకు, పిల్లలకు వీరికి పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ పథకంలో గర్భిణులు, బాలింతలు, 3-6 ఏళ్ల పిల్లలకు నిత్యం పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య విషయాలు, బరువులు పరిశీలించి నమోదు చేయాలి. కానీ కొన్ని కేంద్రాల్లో సక్రమంగా అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతి ఆరుగురిలో ఒకరు బాధితులు
జిల్లాలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణులకు హెచ్‌బీ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ప్రతి ఆరుగురు గర్భిణుల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రసవ సమయంలో కనీసం 10-11 శాతం హెచ్‌బీకి వచ్చేలా ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలోని ఏఎన్‌ఎంలు చూడాల్సిన అవసరం ఉంది.
తలసరి భోజనానికి రూ.21 ఖర్చు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఏర్పాటు చేసే భోజనానికి తలసరి ప్రభుత్వం ఒక్క పూటకు రూ.21 వరకు ఖర్చు చేస్తుంది. ఈ లెక్కన జిల్లాలో 10,897 మంది అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదై ఉన్నారు. వీరిలో 6,400 మంది వరకు కేంద్రాల్లో భోజనం చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.22.88 లక్షల వరకు ప్రభుత్వం వెచ్చిస్తుంది.
పలు రకాలుగా ప్రభావం
- శాంతప్ప, చిన్న పిల్లల వైద్య నిపుణులు, ప్రభుత్వ ఆస్పత్రి, వికారాబాద్
పోషకాహారంలో లభించే ఇనుము ధాతువు ముఖ్యంగా మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారీలో కీలకపాత్ర పోషిస్తుంది. మెదడు పెరుగుదల, వ్యాధి నిరోధక శక్తి, కండరాల పనితీరుకు ఇనుము అవసరం. ఇది లేకుంటే రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది. గర్భిణులకు ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. రక్తం సరిగా లేకపోవడంతో నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం, తక్కువ రోగనిరోధక శక్తి, త్వరగా వ్యాధుల బారిన పడి తనువు చాలించడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రసవ సమయంలో గర్భిణికి రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణులు సంతులిత ఆహారం తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: సెప్టెంబర్ 30న ‘మోత మోగిద్దాం’.. తెదేపా వినూత్న నిరసనకు పిలుపు
-
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 19,600 పైకి నిఫ్టీ
-
Ashwin: అదృష్టమంటే అశ్విన్దే.. అనుకోకుండా మళ్లీ ప్రపంచకప్ జట్టులో!
-
Abhishek Banerjee: నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు.. ఈడీ సమన్లపై అభిషేక్ బెనర్జీ
-
Rain: హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
-
The Sycamore Gap: ప్రఖ్యాత సైకమోర్ గ్యాప్ వృక్షం నరికివేత.. 16 ఏళ్ల బాలుడి దుశ్చర్య..!