logo

ప్రచారానికి వాహనం సిద్ధం

గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ప్రచార రథాన్ని విరామం లేకుండా తిప్పారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పెద్దగా అవసరం లేకపోవడంతో మూలన పడేశారు.

Published : 20 Sep 2023 02:17 IST

వికారాబాద్‌, న్యూస్‌టుడే: గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ప్రచార రథాన్ని విరామం లేకుండా తిప్పారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పెద్దగా అవసరం లేకపోవడంతో మూలన పడేశారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో దుమ్ము దులిపి శుభ్రం చేశారు. చాలాకాలం పాటు ఉపయోగించకపోవడంతో వాహనానికి సంబంధించిన పలు పరికరాలు తుప్పుపట్టాయి. మధ్యలో మొరాయించకుండా అవసరమైన అన్ని పరికరాలను అమర్చి ప్రచారానికి సిద్ధం చేయడానికి పట్టణంలోని ఓ మెకానిక్‌ షెడ్డుకు తీసుకువచ్చారు. షెడ్డులో భారాస ప్రచార రథాన్ని చూసిన పలువురు ఎన్నికలు వస్తున్నాయి కదా.. అందుకే ఏర్పాట్లు చేస్తున్నారని స్థానికులు కొందరు వ్యాఖ్యానించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని