logo

Hyderabad: ‘రూ.300 చెల్లించండి.. 200 గజాల భూమి పొందండి’

కేవలం రూ.300 కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకోండి. 200 గజాల భూమి, రూ.లక్ష లోన్‌ ఇస్తామం’టూ రవీంద్రభారతి పక్కనే ఉన్న మౌంట్‌ నసీర్‌ అపార్ట్‌మెంట్‌లోని ‘జై మహాభారత్‌ పార్టీ’ అధ్యక్షుడు, న్యాయవాది భగవాన్‌ శ్రీఅనంత విష్ణు తమను నమ్మించారంటూ వందల సంఖ్యలో వచ్చిన మహిళలు తరలివచ్చి ఆందోళనకు దిగారు.

Updated : 21 Sep 2023 08:39 IST

 అనంత విష్ణు లీలలు
జై మహాభారత్‌ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ప్రజల మధ్య భగవాన్‌ అనంత విష్ణు

నారాయణగూడ, న్యూస్‌టుడే: కేవలం రూ.300 కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకోండి. 200 గజాల భూమి, రూ.లక్ష లోన్‌ ఇస్తామం’టూ రవీంద్రభారతి పక్కనే ఉన్న మౌంట్‌ నసీర్‌ అపార్ట్‌మెంట్‌లోని ‘జై మహాభారత్‌ పార్టీ’ అధ్యక్షుడు, న్యాయవాది భగవాన్‌ శ్రీఅనంత విష్ణు తమను నమ్మించారంటూ వందల సంఖ్యలో వచ్చిన మహిళలు తరలివచ్చి ఆందోళనకు దిగారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూమి ఇవ్వాలంటూ మహిళలు అనంత విష్ణును నిలదీశారు. ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా కొందరు మహిళలు నిలదీయగా.. మరో మహిళ వారించే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడున్న మహిళలు ఆమెపై దాడికి దిగారు. ఇతర జిల్లాల నుంచి కూడా మహిళలు రావడం గమనార్హం. గతంలో సైఫాబాద్‌ పోలీసులు అనంత విష్ణుపై కేసు నమోదు చేశారు. తాను సుప్రీంకోర్టు న్యాయవాదినని చెప్పేవాడు. ఇప్పటికి లక్షల మంది నుంచి రూ.300 చొప్పున వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అనంత విష్ణును ప్రశ్నించగా తమ ట్రస్టుకు సంబంధించి వేలాది ఎకరాల భూములున్నాయని, పేదలకు పంచిపెడతామంటూ ప్రకటించడం గమనార్హం. ఈ సమావేశం ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించాలనుకున్నామని, డీసీపీ అనుమతించ లేదని, కోర్టుకు వెళతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని