logo

475 బస్సులు

అన్ని కళాశాలల తరగతులు ఒకేసారి ప్రారంభమవుతుండడంతో విద్యార్థులు బస్సుల్లో సీట్లు లేక, లోపల నిల్చొనేందుకు స్థలం లేక డోర్‌ బయట ప్రమాదకరంగా వేలాడుతున్న పరిస్థితి.

Updated : 23 Sep 2023 03:47 IST

విద్యార్థులు వేలాడకుండా వెళ్లేలా ఆర్టీసీ అదనపు సర్వీసులు

స్టాపుల్లో ఉండి రద్దీ నియంత్రిస్తున్న సిబ్బంది

ఈనాడు - హైదరాబాద్‌: అన్ని కళాశాలల తరగతులు ఒకేసారి ప్రారంభమవుతుండడంతో విద్యార్థులు బస్సుల్లో సీట్లు లేక, లోపల నిల్చొనేందుకు స్థలం లేక డోర్‌ బయట ప్రమాదకరంగా వేలాడుతున్న పరిస్థితి. ఈ అవస్థల నుంచి ఉపశమనం కల్పించడానికి ఆర్టీసీ అధికారులు భారీ కసరత్తు చేశారు. కళాశాలలు ఎన్ని ఉన్నాయి.. ఎంత మంది విద్యార్థులు బస్సులపై ఆధారపడి వెళ్తున్నారు. వీరికి సరిపడా బస్సులను తిప్పాలంటే ఎన్ని సమకూర్చాలి అనే అంశాలపై కసరత్తు చేశారు. ముఖ్యమైన పాయింట్ల నుంచి బస్సు వెనుక బస్సును సిద్ధం చేసి విద్యార్థులు వేలాడుతూ ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  

రద్దీ కారిడార్లను గుర్తించి..

శివార్లలోని కళాశాలలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం కీలక మార్గాలను కారిడార్లుగా విభజించారు. హయత్‌నగర్‌, మేడ్చల్‌ కారిడార్‌లను అత్యంత రద్దీవిగా గుర్తించారు. ఇందుకు 475 ప్రత్యేక బస్సులు అవసరమని గుర్తించి.. ఆ మేరకు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లోనూ రద్దీ ఎక్కువగా ఉందని 40 బస్సులు ఆవైపు అదనంగా నడపాలని నిర్ణయించారు. ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకూ ప్రతి 8 నిమిషాలకు ఒకటి ఎల్బీనగర్‌ నుంచి ఇబ్రహీంపట్నం వైపు.. బస్సు ఉండేలా చర్యలు తీసుకున్నామని గ్రేటర్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని