logo

నిమజ్జనోత్సవం.. బల్దియా పొదుపు మంత్రం

రాజధానిలో వినాయక ఉత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతాయి. పదకొండో రోజు నిర్వహించే శోభాయాత్రను తిలకించేందుకు లక్షలాది మంది నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌కు పయనమవుతారు.

Published : 23 Sep 2023 03:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో వినాయక ఉత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతాయి. పదకొండో రోజు నిర్వహించే శోభాయాత్రను తిలకించేందుకు లక్షలాది మంది నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌కు పయనమవుతారు. అంతటి ఆదరణ ఉన్న ఉత్సవాలను నిర్వహించడంలో.. ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ పొదుపు మంత్రం పాటిస్తోందనే వాదన వినిపిస్తోంది. గతంతో పోలిస్తే.. ఈసారి పారిశుద్ధ్యానికి కేటాయించిన సిబ్బంది మూడో వంతే. క్రేన్ల సంఖ్యనూ తగ్గించింది. అధికారులకు బాధ్యతల కేటాయింపు, ఇతరత్రా చర్యలు జీహెచ్‌ఎంసీపై విమర్శలకు కారణమవుతున్నాయి.

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకునేందుకు శుక్రవారం సాయంత్రం పోటెత్తిన భక్తులు

గతంలో ఇలా..

  •  సుమారు 303 కి.మీ పొడవునా నగరంలో శోభాయాత్ర జరుగుతుంది. రహదారులపై వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా జీహెచ్‌ఎంసీ గతేడాది 8,116 మంది కార్మికులు, సిబ్బందిని అందుబాటులో ఉంచింది. ఈ సంవత్సరం 2,960 మందితో సరిపెట్టింది.
  • గతంలో నగరవ్యాప్తంగా 60 చోట్ల నిమజ్జనానికి 172 క్రేన్లు ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది 126కే పరిమితమైంది.  హుస్సేన్‌సాగర్‌ వద్ద అందుబాటులో ఉంచే పడవల సంఖ్యనూ తగ్గించింది. నిధుల సమస్య వల్ల ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతోపాటు, ఎన్నికలకు సంబంధించిన విధుల్లో ఉన్నతాధికారులు తీరిక లేకుండా ఉండటం వల్ల సన్నద్ధత తగ్గిందనే వాదన అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని