logo

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉపాధ్యాయుల కోలాహలం

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీకి వేలాదిగా తరలి   వచ్చిన ఉపాధ్యాయులతో శుక్రవారం కోలాహలం నెలకొంది.

Updated : 23 Sep 2023 03:52 IST

2వేల మందికిపైగా తరలిరావడంతో సందడి

రామోజీ ఫిల్మ్‌సిటీలో వైల్డ్‌వెస్ట్‌ స్టంట్‌ షో తిలకిస్తున్న ఉపాధ్యాయులు

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీకి వేలాదిగా తరలి   వచ్చిన ఉపాధ్యాయులతో శుక్రవారం కోలాహలం నెలకొంది. హైదరాబాద్‌లోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, పల్లవి గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌కు చెందిన 2 వేల మందికిపైగా ఉపాధ్యాయులు ఫిల్మ్‌సిటీ సందర్శనకు తరలి     వచ్చారు. నిత్యం తరగతి గదుల్లో విద్యా బోధనతో తీరిక  లేకుండా గడిపే గురువులంతా కలిసి ప్రకృతి రమణీయ రామోజీ ఫిల్మ్‌సిటీ అందాల మధ్య విహరించి సరికొత్త అనుభూతిని ఆస్వాదించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని అందమైన లొకేషన్లను, అద్వితీయమైన గార్డెన్లను, పక్షుల పార్కును, చూడముచ్చటైన ప్రదర్శనలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఫిల్మ్‌సిటీలో బాహుబలి సినిమా చిత్రీకరణ జరిగిన అద్భుత సెట్‌ సందర్శన, యురేకాలో వైల్డ్‌వెస్ట్‌ స్టంట్‌ షో, మర్చిపోలేని షాపింగ్‌ అనుభూతి, సీతాకోక చిలుకల పార్కు, రామోజీ మూవీ మ్యాజిక్‌.. ఒక్కటేమిటి ఫిల్మ్‌సిటీ వీక్షణ మొత్తం ఓ అద్భుతమంటూ సంతోషం వ్యక్తం చేశారు. సహచర ఉపాధ్యాయులతో ఇలా పర్యాటక లోకం, సినీ ప్రపంచంలో విహరించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని అందించిందని పేర్కొన్నారు. జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను అందించే రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనకు కుటుంబసభ్యులు, సహచర మిత్రులతో కలిసి ప్రతి ఒక్కరూ రాదగిన పర్యాటక కేంద్రమని కొనియాడారు. తమ పాఠశాలల ఉపాధ్యాయులందరితో కలిసి రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించడం, ఉపాధ్యాయ సమ్మేళనం నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, పల్లవి గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ఛైర్మన్‌ ఎం.కొమరయ్య పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని