logo

నాలుగోసారి ప్రతిభ అవార్డు

మండలంలోని సిద్ధులూరు పోస్టుమాస్టర్‌ మహ్మద్‌ బురానుద్దీన్‌ విధి నిర్వహణలో ప్రతిభను కనబరిచి ప్రాంతీయ స్థాయిలో రెండు అవార్డులను అందుకున్నారు.

Published : 23 Sep 2023 03:41 IST

పీఎంజీ టీఎం శ్రీలత, ఏడీ సురేందర్‌బాబు చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న బురానుద్దీన్‌

కారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మండలంలోని సిద్ధులూరు పోస్టుమాస్టర్‌ మహ్మద్‌ బురానుద్దీన్‌ విధి నిర్వహణలో ప్రతిభను కనబరిచి ప్రాంతీయ స్థాయిలో రెండు అవార్డులను అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌ జామే ఉస్మానియా తపాలా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోస్టుమాస్టర్‌ జనరల్‌ టీఏం. శ్రీలత, ఏడీ సురేందర్‌బాబు, ఎస్‌ఎస్‌పీ సురేశ్‌  బురానుద్దీన్‌కు అందజేశారు. ఆన్‌లైన్‌లో కొత్తగా 3,495 ఖాతాలు, జనరల్‌ ఇన్సూరెన్స్‌లో రూ.6 లక్షల విలువైన పాలసీలు చేయించడంతో అవార్డులు వరించాయి. ఈ సందర్భంగా బురానుద్దీన్‌ మాట్లాడుతూ.. నాలుగో సారి అవార్డులను అందుకోవటం సంతోషంగా ఉందన్నారు. తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని