logo

ఓయూ శతాబ్ది ఉత్సవాలపై స్టాంపు విడుదల చేయాలి: వీసీ

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలపై తపాలా బిళ్లను విడుదల చేయాలని ఉపకులపతి ఫ్రొఫెసర్‌ రవీందర్‌ విజ్ఞప్తి చేశారు.

Published : 23 Sep 2023 03:41 IST

అవార్డు గ్రహీతలతో  చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌    జనరల్‌ ప్రకాష్‌, ఓయూ వీసీ రవీందర్‌,  పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ విద్యాసాగర్‌ రెడ్డి, శ్రీలత, సాయి పల్లవి తదితరులు

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలపై తపాలా బిళ్లను విడుదల చేయాలని ఉపకులపతి ఫ్రొఫెసర్‌ రవీందర్‌ విజ్ఞప్తి చేశారు. స్టాంపుపై ఆర్ట్స్‌ కళాశాల భవనాన్ని ముద్రించాలని కోరారు. ఓయూ ఆవరణలోని జామై ఉస్మానియా పోస్టాఫీసులో రీజనల్‌ స్థాయి ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం నిర్వహించారు. తెలంగాణ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ ఉత్తరాల బట్వాడానే కాకుండా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమ వంటి సేవలు అందిస్తున్నామని చెప్పారు. అనంతరం 31 మంది ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అధికారులు సాయి పల్లవి, విద్యాసాగర్‌ రెడ్డి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని