logo

ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఆత్మీయ సమ్మేళనం

ఏపీ, తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేసి పదవీవిరమణ పొందిన పోలీసు అధికారుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం జరిగింది.

Published : 23 Sep 2023 03:41 IST

కుటుంబ సభ్యులతో కలిసి సమావేశంలో పాల్గొన్న విశ్రాంత పోలీసు అధికారులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఏపీ, తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేసి పదవీవిరమణ పొందిన పోలీసు అధికారుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 1 ఫస్ట్‌ లాన్సర్‌ రహదారిలోని పోలీస్‌ ఆఫీసర్స్‌ మెస్‌ ఆవరణ ఇందుకు వేదిక అయ్యింది. 1971 నుంచి 1991 బ్యాచ్‌ వరకు ఐజీ, డిఐజీ, కమాండెంట్లుగా పనిచేసి పదవీవిరమణ పొందిన 200ల మంది అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఏటా ఇలాంటి సమ్మేళనాలు నిర్వహిస్తామని విశ్రాంత డిఐజీ తోట వెంకట్రావ్‌ తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత అధికారులు గోపీనాథ్‌, జేజీ మురళి, ఎన్‌.సుధాకర్‌, కృష్ణమూర్తిరావు, మోకం సింగ్‌, నాగుర్‌ రెడ్డి, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని