logo

రక్త క్యాన్సర్‌కు నిమ్స్‌లో ఆధునిక చికిత్స

నిమ్స్‌ ఆస్పత్రిలో రక్త క్యాన్సర్‌(లుకేమియా) వ్యాధిగ్రస్థులకు ఆధునిక సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్‌ నగరి బీరప్ప తెలిపారు.

Published : 23 Sep 2023 03:41 IST

అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నిమ్స్‌ డైరెక్టర్‌ డా.బీరప్ప

ఈనాడు, హైదరాబాద్‌: నిమ్స్‌ ఆస్పత్రిలో రక్త క్యాన్సర్‌(లుకేమియా) వ్యాధిగ్రస్థులకు ఆధునిక సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్‌ నగరి బీరప్ప తెలిపారు.ముందే గుర్తిస్తే రక్త క్యాన్సర్‌ పూర్తిగా నియంత్రించవచ్చున్నారు. శుక్రవారం క్రానిక్‌ మైలాడ్‌ లుకేమియా (సీఎంఎల్‌) దినోత్సవం సందర్భంగా ఆస్పత్రి లెర్నింగ్‌ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. లుకేమియా వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పుడున్న ఆధునిక సేవలతో తిరిగి సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని చెప్పారు. బోన్‌మ్యారో లాంటి చికిత్సలతో వ్యాధిని నియంత్రించే వెసులుబాటు ఉందన్నారు. మెడికల్‌ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సదాశివుడు, మెడికల్‌ అంకాలజీ డా.మెహర్‌లక్ష్మి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని