logo

చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం: తెదేపా

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బిల్డర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 23 Sep 2023 03:41 IST

మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర
అధికార ప్రతినిధి ప్రవీణ్‌కుమార్‌

గోల్నాక, న్యూస్‌టుడే: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బిల్డర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ప్రతిపక్ష నేత లేకుండా అసెంబ్లీని నిర్వహించి సభలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శుక్రవారం నింబోలిఅడ్డాలోని ఏకే భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి తుగ్లక్‌ పాలనకు వ్యతిరేకంగా రైతులు, ఉద్యోగులు సహా అన్నివర్గాల ప్రజలూ ఉద్యమిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వారంతా ఆయనకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.  నేతలు భాస్కర్‌, మురళీగౌడ్‌, అనిల్‌కుమార్‌, మధుసూదన్‌, రాజ్‌కుమార్‌, రాంచందర్‌గుప్త, పెంటం రాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని