logo

కనీస వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి

గ్రామంలో మౌలిక వసుతలతో పాటు ఉచిత వైఫై సౌకర్యం కల్పించడం శుభపరిణామమని, ఇందుకు సర్పంచి నర్సింహారెడ్డి చొరవ తీసుకోవడం అభినందనీయమని అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ అన్నారు.

Published : 23 Sep 2023 03:59 IST

పనులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ

మోమిన్‌పేట: గ్రామంలో మౌలిక వసుతలతో పాటు ఉచిత వైఫై సౌకర్యం కల్పించడం శుభపరిణామమని, ఇందుకు సర్పంచి నర్సింహారెడ్డి చొరవ తీసుకోవడం అభినందనీయమని అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ అన్నారు. సుపరిపాలనలో జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయితీ అవార్డు అందుకున్న చీమలదరి గ్రామాన్ని ఆయన శుక్రవారం సందర్శించి పలు అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. పురోగతిలో గ్రామస్థుల భాగస్వామ్యంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. రోడ్ల పక్కన కుండీలను ఏర్పాటు చేయడంతో పరిసరాలు  శుభ్రంగా ఉన్నాయన్నారు. ప్రతి గ్రామంలో కనీస వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో శైలజారెడ్డికి సూచించారు. దశాబ్ది వనంలో మొక్కల సంరక్షణకు పక్కాగా ఉండాలని ఎంపీవో యాదగిరికి చెప్పారు. సర్పంచి నర్సింహారెడ్డి కార్యదర్శి సుగుణ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని