logo

మంత్రికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి జిల్లాలోని భారాస ప్రజాప్రతినిధులు, అధికారులు శనివారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Published : 24 Sep 2023 01:41 IST

మహేందర్‌రెడ్డిని సన్మానించిన ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, ఆనంద్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి

న్యూస్‌టుడే, తాండూరు, యాలాల, వికారాబాద్‌ మున్సిపాలిటీ, వికారాబాద్‌ టౌన్‌, తాండూరు గ్రామీణ, తాండూరు టౌన్‌: రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి జిల్లాలోని భారాస ప్రజాప్రతినిధులు, అధికారులు శనివారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి శాలువాలతో సన్మానం చేసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ కుమార్‌, కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి మిఠాయి తినిపించి శాలువాలు, గజమాలలతో సన్మానం చేశారు. 

  • యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా ఆధ్వర్యంలో యాలాల మండల భారాస నాయకులు మహేందర్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చారు. ముద్దాయిపేట్‌ గ్రామంలో సర్పంచ్‌ కృష్ణయ్యగౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి.  
  • నగరంలో మహేందర్‌రెడ్డిని డీసీసీబీ డైరెక్టర్‌ రవీందర్‌గౌడ్‌ అధ్వర్యంలో శనివారం విపణి మాజీ అధ్యక్షులు శ్రీనివాస్‌, కుర్వవెంకటయ్య, శ్రీనివాస్‌గౌడ్‌ కలిశారు. గౌతాపూర్‌ గ్రామ కమిటీ అధ్యక్షులు రాంచంద్రారెడ్డి, రాజప్పగౌడ్‌, నారాయణ్‌రెడ్డి, రాజుగౌడ్‌, చెంగోల్‌ రాము, మల్కాపూర్‌ పండరి తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛాల్ని అందించారు.  
  • మహేందర్‌రెడ్డిని వికారాబాద్‌ పుర అధ్యక్షురాలు మంజుల, రమేశ్‌కుమార్‌ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డిని కలిశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని