logo

ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూలు.. ఏర్పాట్లలో వేగం పెంచండి

రాబోయే శాసనసభ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సెక్టోరియల్‌ అధికారులు, పోలీస్‌ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ కోరారు.

Published : 24 Sep 2023 03:03 IST

అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న బల్దియా కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాబోయే శాసనసభ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సెక్టోరియల్‌ అధికారులు, పోలీస్‌ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ కోరారు. బంజరాహిల్స్‌ ఆదివాసీ బంజారాభవన్‌లో శనివారం ఆయన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సి.వి.ఆనంద్‌తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్‌రాస్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతి 10-12 పోలింగ్‌ కేంద్రాలకు ఓ సెక్టోరియల్‌ అధికారి, పోలీసు సెక్టోరియల్‌ అధికారులు బాధ్యులుగా ఉంటారు. తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల హద్దుల పరిశీలన, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపును ఆయా అధికారులు ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలి.’’ అని సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ సి.వి.ఆనంద్‌ మాట్లాడుతూ.. ఈ దఫా పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరిగిందని, సెక్టోరియల్‌ అధికారులు సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల వివరాలను సేకరించి ఎన్నికలకు పరిశీలకులకు తెలియజేయాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌మన్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఎన్నికల షెడ్యూలు ఎప్పుడైనా రావొచ్చని, ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ అన్నారు. బీఆర్‌కే భవన్‌లో నిర్వహించిన నోడల్‌ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని