logo

ఒకేసారి 21వేల ఇళ్లకు లాటరీ

గ్రేటర్‌లో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం ఊపందుకోవడంతో.. ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది.

Published : 24 Sep 2023 03:03 IST

27న నిర్వహిస్తున్నట్లు తలసాని ప్రకటన

మంత్రి తలసానితో కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌, కలెక్టర్‌ అనుదీప్‌

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం ఊపందుకోవడంతో.. ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తన కార్యాలయంలో శనివారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌తో చర్చించారు. సర్కారు నిర్ణయించినట్లు ఈనెల 27న మూడు, నాలుగు దశ ఇళ్ల పంపిణీకి ఒకేసారి లాటరీ తీయాలని, అందుకు హైదరాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకటి, రెండు దశల్లో మొత్తం 24,900 ఇళ్లను పంపిణీ చేశామని, మూడు, నాలుగు దశల్లో 21వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మంత్రి వివరించారు. లాటరీలో ఎంపికైన లబ్ధిదారుల్లో 10,500ల మందికి అక్టోబరు 2న, మిగిలిన 10,500ల మందికి అక్టోబరు 5న గృహ సముదాయాల వద్దనే పట్టాలను అందజేస్తామన్నారు. రాజకీయ జోక్యానికి తావివ్వకుండా పారదర్శకంగా చేడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని