logo

Hyderabad: ఆ పది నిమిషాల్లో ఏం జరిగింది?

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన చందానగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌ భవానీపురం వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన బిస్సు కర్మ రామ్‌జీ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు.

Updated : 24 Sep 2023 09:29 IST

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి అనుమానాస్పద మృతి

శేరిలింగంపల్లి: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన చందానగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌ భవానీపురం వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన బిస్సు కర్మ రామ్‌జీ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో భార్య పూజాదేవి ఛాతీలో నొప్పిగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లాలని భర్తకు ఫోన్‌ చేసి కోరింది. తాను రెడ్డికాలనీలోని కమ్యూనిటీహాల్‌ దగ్గర ఉంటానని రమ్మని చెప్పింది. అక్కడికి వచ్చి భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వీరు ఆసుపత్రికి వెళ్లిన పది నిమిషాల్లోనే పక్కింటికి చెందిన దావీదు ఫోన్‌ చేసి మీ కుమారుడు బిస్సు కర్మ కునాల్‌(12) దుస్తులు ఆరేసే తీగ చుట్టుకొని ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పాడు. దీంతో వారు ఇంటికి వెళ్లి కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ బాలుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని