logo

నిత్యం వివాదాల్లో సినీనటుడు నవదీప్‌

సినీనటుడు పల్లపోలు నవదీప్‌ నిత్యం ఏదోఒక వివాదంలో చిక్కి చర్చనీయాంశంగా మారుతున్నాడు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు అతడి చుట్టూ తిరుగుతోంది. ఇతడి ద్వారానే మాదకద్రవ్యాలు  నటీ, నటులకు చేరుతున్నాయనే ఆరోపణలున్నాయి.

Updated : 24 Sep 2023 15:41 IST

పబ్బుల్లో గొడవలు, దాడులతో గతంలో కేసులు
తాజాగా రెండోసారి డ్రగ్‌ కేసులో..

ఈనాడు, హైదరాబాద్‌: సినీనటుడు పల్లపోలు నవదీప్‌ నిత్యం ఏదోఒక వివాదంలో చిక్కి చర్చనీయాంశంగా మారుతున్నాడు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు అతడి చుట్టూ తిరుగుతోంది. ఇతడి ద్వారానే మాదకద్రవ్యాలు  నటీ, నటులకు చేరుతున్నాయనే ఆరోపణలున్నాయి. తాజాగా మాదాపూర్‌లోని ఫ్రెష్‌లివింగ్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌పార్టీతో సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి అరెస్ట్‌తో లింకులు బయటపడుతున్నాయి. ఇతని నుంచి రాబట్టిన సమాచారంతో ఇటీవలే 8 మందిని అరెస్ట్‌ చేశారు. వారిలో సినీ, రాజకీయ వర్గాలకు చెందిన వారు ఉండటంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. డ్రగ్స్‌ వినియోగదారుడిగా నవదీప్‌ను గుర్తించిన పోలీసులు అతన్ని విచారించారు. నగరంలో రాంచంద్‌తో కలసి బీపీఎం పబ్‌ నిర్వహించినపుడు ముంబయి నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు సాక్ష్యాలు వెలుగు చూశాయి. వీటి ఆధారంగా కూపీ లాగితే ముంబయి, బెంగళూరు, దిల్లీకి చెందిన నైజీరియన్లు, స్థానిక డ్రగ్స్‌ విక్రేతలతో పరిచయాలు బయటకొచ్చాయి. విచారణలోనూ తనకేం తెలియదన్నా చివరకు తన సంబంధాలను వివరించాడు. 

పడవ.. గొడవ.. గతంలో తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్‌ వ్యవహారంలోనూ నవదీప్‌ విచారణ ఎదుర్కొన్నాడు. 2010-11లో ఇతడు స్నేహితులతో కలసి నాగార్జునసాగర్‌ విహారానికి వెళ్లాడు. అనుమతి లేకుండా కృష్ణానదిలో పడవ ప్రయాణం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అదే ఏడాది నగరంలోని ప్రముఖ హోటల్‌లో నవదీప్‌తో కొందరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గొడవపడ్డారు.  నవదీప్‌ ఒక విద్యారిని గాయపరిచాడు. పరస్పర ఫిర్యాదులతో మాదాపూర్‌ ఠాణాలో కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లో అతివేగంగా వాహనం నడుపుతూ పోలీసులతో అనుచితంగా ప్రవర్తించడంతో కేసు నమోదైంది. రెండోసారి డ్రగ్స్‌ కేసులో పక్కాగా దొరికాడని పోలీసులు చెబుతున్నారు. ఇతడి సెల్‌ఫోన్లలో డేటా రిట్రీవ్‌ చేశాక వచ్చే ఆధారాలతో చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు