logo

లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై కార్యశాల

లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై అందరికీ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.మాధవీదేవి అభిప్రాయపడ్డారు.

Published : 24 Sep 2023 03:03 IST

ప్రసంగిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీదేవి

శామీర్‌పేట: లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై అందరికీ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.మాధవీదేవి అభిప్రాయపడ్డారు. శనివారం శామీర్‌పేటలోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల నివారణ చట్టం-2013పై ఒక రోజు కార్యశాల జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పని చేసే చోట మహిళల హక్కులకు, ఆత్మగౌరవానికి రక్షణ ఇచ్చే చట్టం మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  నల్సార్‌ ఆచార్యులు అమితా దండా, న్యాయవాది, వసుధా నాగరాజ్‌, మధుజిత్‌ సింగ్‌, అవగాహన కల్పించారు. నల్సార్‌ వీసీ ఆచార్య శ్రీకృష్ణదేవరావు, రిజిస్ట్రార్‌ విద్యుల్లతారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని