logo

పైవంతెన నిర్మించాలంటూ మృతదేహంతో ధర్నా

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంఘటనకు పైవంతెన లేకపోవడమే కారణమంటూ శంషాబాద్‌లో బస్తీవాసులు జాతీయ రహదారిపై ఆందోళన చేసిన ఉదంతమిది.

Published : 24 Sep 2023 03:03 IST

మృతదేహంతో రోడ్డుపై గ్రామస్థుల ఆందోళన

శంషాబాద్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంఘటనకు పైవంతెన లేకపోవడమే కారణమంటూ శంషాబాద్‌లో బస్తీవాసులు జాతీయ రహదారిపై ఆందోళన చేసిన ఉదంతమిది. శంషాబాద్‌లోని సిద్ధాంతి బస్తీకి చెందిన జక్కుల యాదయ్య(62) శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లడానికి సిద్ధాంతి బస్టాప్‌ వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా ఓ బైక్‌ ఢీకొట్టింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పైవంతెన లేకపోవడంతోనే మృత్యువాత పడుతున్నారని బస్తీవాసులు హైవేపై మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించి విమానాశ్రయానికి వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న శంషాబాద్‌ ఏసీపీ రామచంద్రారావు, ఆర్జీఐఏ సీఐ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ సీఐ రాజు ఆందోళనకారులను సముదాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని