logo

25 నుంచి ప్రపంచ పర్యాటక వేడుకలు

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌ శిల్పకళావేదికలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

Published : 24 Sep 2023 03:03 IST

27న ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానం

వివరాలు వెల్లడిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చిత్రంలో నిఖిల, శ్రీనివాస్‌యాదవ్‌, శైలజా రామయ్యర్‌, మనోహర్‌

సోమాజిగూడ: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌ శిల్పకళావేదికలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. శనివారం బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పర్యాటక రంగం మనిషికి ఉత్సాహం, దేశానికి ప్రతిష్ఠ ఇస్తుందన్నారు. గత పదేళ్లలో రాష్ట్రానికి పర్యాటకుల రాక బాగా పెరిగిందన్నారు. మహబూబ్‌నగర్‌లో 2097 ఎకరాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామని, జంగిల్‌ సఫారీ అందుబాటులోకి రానుందన్నారు. 27న జిల్లాల కలెక్టరేట్లలో వేడుకలు జరుగుతాయని, ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానం ఉంటుందన్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌, పర్యాటక ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌, డైరెక్టర్లు నిఖిల, మనోహర్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని