logo

మహాగణపతిని దర్శించుకున్న ప్రముఖులు

ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 5 లక్షల మంది వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Published : 24 Sep 2023 03:03 IST

ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 5 లక్షల మంది వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఖైరతాబాద్‌లోని మహాగణపతిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు.  మీడియా ఫ్రెండ్స్‌, వివేకానంద సేవా సమితి సంయుక్తంగా 19వ పర్యాయం నిర్వహించిన ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ దంపతులు, రాష్ట్ర స్టాంప్స్‌, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ దంపతులు, సినీ దర్శకుడు రాజమౌళి, రాష్ట్ర సమాచార శాఖకు చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు.

మహాగణపతిని దర్శించుకున్న జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ దంపతులు

స్టాంప్స్‌, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిత్తల్‌ దంపతులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని