logo

Hyderabad: నేడే డబుల్‌ బెడ్‌ రూమ్‌ అర్హుల జాబితా ప్రకటన

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు పడకగదుల ఇళ్లు పొందేందుకు అర్హులైన 36,907 మంది అదృష్టవంతుల వివరాలు బుధవారం వెల్లడి కానున్నాయి.

Updated : 27 Sep 2023 07:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు పడకగదుల ఇళ్లు పొందేందుకు అర్హులైన 36,907 మంది అదృష్టవంతుల వివరాలు బుధవారం వెల్లడి కానున్నాయి. గ్రేటర్‌లోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్నవారిలో అర్హుల పేర్లు తెలియనున్నాయి. వాటిని హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్‌ మల్లారెడ్డి, మహమూద్‌ అలీలు వెల్లడించనున్నారు. గ్రేటర్‌ పరిధిలో బుధవారం నిర్వహించనున్న లక్కీడ్రాలో ఎంపికైన 36,907 మందికి అక్టోబరు 3, 5 తేదీల్లో ఇళ్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు