logo

రోడ్డుపై చెత్త వేసినందుకు సూపర్‌ మార్కెట్‌కు రూ.25వేల జరిమానా

రోడ్డుపై చెత్త పడేసి చేతులు దులుపుకొంటున్న సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకులపై గ్రేటర్‌ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి రూ.25వేల జరిమానా విధించారు.

Published : 27 Sep 2023 02:22 IST

నిర్వాహకులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆగ్రహం

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: రోడ్డుపై చెత్త పడేసి చేతులు దులుపుకొంటున్న సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకులపై గ్రేటర్‌ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి రూ.25వేల జరిమానా విధించారు. మంగళవారం ఆయన అత్తాపూర్‌ హైదర్‌గూడలో కారులో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో చెత్తను రోడ్డుపైకి ఊడుస్తున్న విజేత సూపర్‌ మార్కెట్‌ సిబ్బందిని గ్రేటర్‌ కమిషనర్‌ గమనించారు. బాధ్యతా రాహిత్యంగా చెత్తను రహదారిపై పడేస్తున్న మార్కెట్‌ యాజమాన్యానికి వెంటనే జరిమానా విధించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఉప్పర్‌పల్లిలోని పెద్దతాళ్లకుంట చెరువు చుట్టూ వాకింగ్‌ట్రాక్‌ పార్కును,  చింతకుంట పార్కును అధికారులతో కలిసి పరిశీలించారు.  అక్కడ వీధి దీపాలతో పాటు ఒపెన్‌ జిమ్‌ తదితర మౌలిక వసతులను వెంటనే కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ఇంటింటి చెత్త సేకరణ తీరు గురించి జనప్రియా అపార్ట్‌మెంట్‌లో నివాసితులను అడిగి తెలుసుకున్నారు. జడ్సీ వెంకటన్న, డీసీ రవికుమార్‌, కార్పొరేటర్‌ సంగీత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని