logo

Hyderabad Metro Rail: మెట్రో ఆగింది.. రద్దీ పెరిగింది

నాగోల్‌-రాయదుర్గం మెట్రో మార్గంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో సాంకేతికత సమస్య తలెత్తింది. మెట్రో రైలు పలు స్టేషన్లలో 5 నుంచి 15 నిమిషాలపాటు నిలిచిపోయింది.

Updated : 27 Sep 2023 08:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: నాగోల్‌-రాయదుర్గం మెట్రో మార్గంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో సాంకేతికత సమస్య తలెత్తింది. మెట్రో రైలు పలు స్టేషన్లలో 5 నుంచి 15 నిమిషాలపాటు నిలిచిపోయింది. హబ్సిగూడలో 10 నిమిషాలు, మెట్టుగూడలో ఒకసారి 15 నిమిషాలు, మరోసారి 5 నిమిషాలు, తార్నాకలో 10 నిమిషాలు ఆగింది. ఈ ప్రభావం మిగతా స్టేషన్లపై కన్పించింది. అమీర్‌పేట నాగోల్‌ ఫ్లాట్‌ఫాంపై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు కనిపించారు. సాంకేతికత సమస్య తలెత్తడంతో వెంటనే సరి చేసి సర్వీసులు పునరుద్ధరించినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.

భక్తులతో ఖైరతాబాద్‌ స్టేషన్‌ కిటకిట.. : బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ కిటకిటలాడింది. ఖైరతాబాద్‌ పరిసరాలు భక్తులతో నిండిపోవడంతో వాహనాలను దూరంలో నిలపాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని