logo

వైకుంఠ మహాప్రస్థానం ప్రారంభం

బంజారాహిల్స్‌లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికను ఆధునికీకరించి తీర్చిదిద్దిన ‘వైకుంఠ మహాప్రస్థానం’ను మంగళవారం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

Published : 27 Sep 2023 02:47 IST

వైకుంఠ మహాప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌,
చిత్రంలో దానం నాగేందర్‌, ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సురేష్‌

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: బంజారాహిల్స్‌లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికను ఆధునికీకరించి తీర్చిదిద్దిన ‘వైకుంఠ మహాప్రస్థానం’ను మంగళవారం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఫీనిక్స్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ కింద జీహెచ్‌ఎంసీతో కలిసి మహాప్రస్థానాన్ని తీర్చిదిద్దింది.  కేటీఆర్‌ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ‘వైకుంఠ మహాప్రస్థానం’ మొత్తం ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి దహనవాటికలు, వీఐపీ దహనవాటిక, కోల్డ్‌ స్టోరేజ్‌, లాకర్ల గది, సీసీ కెమెరాలు తదితర సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌, జోనల్‌ కమిషనర్‌ వెంకటేష్‌ దోత్రి, ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సురేష్‌ చుక్కపల్లి, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని