logo

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో మొదటిరోజు 236 మంది పయనం

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ (బెంగళూరు) వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మంగళవారం మొద]టి రోజున 236 మంది ప్రయాణికులతో బయలుదేరి వెళ్లింది.

Updated : 27 Sep 2023 05:09 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ (బెంగళూరు) వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మంగళవారం మొద]టి రోజున 236 మంది ప్రయాణికులతో బయలుదేరి వెళ్లింది. ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో, కాచిగూడ స్టేషన్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జెండా ఊపి ఈ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరిన రైలు రాత్రి 11.15 గంటలకు కాచిగూడకు తిరిగి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు కాచిగూడ నుంచి 236 మంది ప్రయాణికులతో యశ్వంత్‌పూర్‌ వెళ్లింది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకతో ప్రతి శనివారం ఉండే కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ (16570) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని