logo

కేంద్ర పరిధిలో లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని, 17 సార్లు టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌-1 సహా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో అవన్నీ రద్దయ్యాయని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 27 Sep 2023 02:47 IST

నియామకపత్రం అందజేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

నారాయణగూడ, న్యూస్‌టుడే:  తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని, 17 సార్లు టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌-1 సహా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో అవన్నీ రద్దయ్యాయని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 12 లక్షల ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చినా ఒక్కటీ రద్దు కాలేదన్నారు. పారదర్శకంగా, ఇప్పటి వరకు 6 లక్షల ఉద్యోగాల నియామకం పూర్తిచేశామని చెప్పారు. మంగళవారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో తపాలా శాఖ-తెలంగాణ సర్కిల్‌ ఆధ్వర్యంలో ‘9వ రోజ్‌గార్‌ మేళా’ జరిగింది. ఏఐఐఎంఎస్‌, ఎస్‌బీఐ, బీడీఎల్‌, ఎఫ్‌సీఐ, మను, హైదరాబాద్‌ యూనివర్సిటీలతో కలిపి మొత్తం 238 మందికి నియామకపత్రాలను కిషన్‌రెడ్డి అందజేశారు. ప్రతీ గ్రామంలో పోస్టాఫీసులు బ్యాంకుల్లా మారి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.  తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌, హైదరాబాద్‌ రీజియన్‌ పీఎంజీ డా.పి.వి.ఎస్‌.రెడ్డి, హెడ్‌క్వార్టర్స్‌ రీజియన్‌ పీఎంజీ టి.ఎం.శ్రీలత, డీపీఎస్‌(హెచ్‌క్యూ) కె.ఎ.దేవరాజ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు