logo

తెలంగాణలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి

తెలంగాణలో మూడేళ్లలో ప్రకృతి పర్యాటకం(ఎకో టూరిజం) అభివృద్ధి చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.

Published : 27 Sep 2023 02:47 IST

సదస్సు ప్రారంభిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో మూడేళ్లలో ప్రకృతి పర్యాటకం(ఎకో టూరిజం) అభివృద్ధి చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ‘మృగవని రిసార్టు’లో రెండు రోజుల ఎకో టూరిజం సదస్సును మంగళవారం అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, అటవీశాఖ ప్రధాన అధికారి ఆర్‌ఎం డొబ్రియాల్‌, టీఎస్‌ఎఫ్‌డీసీ వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ డా.జి.చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ పర్యాటకం అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వరంగల్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో, సత్తుపల్లిలో అటవీ అభివృద్ధి సంస్థ విజయవంతంగా ప్రకృతి పర్యాటక కేంద్రాలను సిద్ధం చేసినట్లు టీఎస్‌ఎఫ్‌డీసీ వైస్‌ఛైర్మన్‌ అండ్‌ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సదస్సులో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఐఎఫ్‌ఎస్‌, జిల్లా అటవీ అధికారులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు