logo

కృత్రిమ మేధతో భారత రక్షణ రంగం బలోపేతం

కృత్రిమ మేధ వినియోగంతో భారత రక్షణ రంగం మరింత బలోపేతం చెందుతుందని ఎలక్ట్రానిక్స్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌(ఈఎంఈ) డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ తుముల్‌ వర్మ పేర్కొన్నారు.

Published : 27 Sep 2023 02:47 IST

లెఫ్టినెంట్‌ జనరల్‌ తుముల్‌ వర్మ, జేఎస్‌ సిడానా,  ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌లతో ఆర్మీ అధికారులు

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: కృత్రిమ మేధ వినియోగంతో భారత రక్షణ రంగం మరింత బలోపేతం చెందుతుందని ఎలక్ట్రానిక్స్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌(ఈఎంఈ) డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ తుముల్‌ వర్మ పేర్కొన్నారు. తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌(ఎంసీఈఎంఈ) ఆడిటోరియంలో ‘భారత రక్షణ రంగంలో కృత్రిమ మేధస్సు పరికరాల వినియోగం’ అంశంపై రెండు రోజుల సదస్సు మంగళవారం ముగిసింది. కృత్రిమ మేధస్సుతో తయారుచేసే బిగ్‌ డేటా, రోబోటిక్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, డ్రోన్‌ సాంకేతికతలను రక్షణ రంగంలో వినియోగించాల్సిన అవసరముందన్నారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ.. భారత సైన్యాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఎంసీఈఎంఈ ముందుకెళ్తుండటం శుభ పరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కృత్రిమ మేధస్సు మిషన్‌(టీఏఐఎం)ను ప్రారంభించి ప్రయోగాలు చేస్తోందని, ఎంసీఈఎంఈ టీఏఐఎంతో కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని